Nov 08,2023 20:52

శిల్పారామాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ విజరురామరాజు

పులివెందుల టౌన్‌ : ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి గురువారం పులివెందుల పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు కలెక్టర్‌ విజరురామరాజు అన్నారు. బుధవారం సాయంత్రం ముఖ్యమంత్రి పర్యటన ప్రాంతాలను ఆయన పరిశీలించి, పర్యటన విజయవంతం చేసేందుకు అందరూ కషి చేయాలని అధికారులను ఆదేశించారు. ముందుగా శ్రీకృష్ణ దేవాలయాన్ని, అనంతరం శిల్పారామంలో పర్యటించి ముఖ్యమంత్రి ప్రారంభించే పనులను పరిశీలించారు. అనంతరం రోప్‌వే ట్రైలర్‌ కలెక్టర్‌ ప్రారంభించారు. అనంతరం ఐవిఆర్‌సిఎల్‌ సందర్శించి ముఖ్యమంత్రి పర్యటన ప్రాంతాలను పరిశీలించి అధికారులకు తగిన సూచనలు సలహాలు ఇచ్చారు. కార్యక్రమంలో ఆర్‌డిఒ వెంకటేశ్వర్లు, తహశీల్దార్‌ మాధవకృష్ణారెడ్డి, ఆర్‌అండ్‌బి ఇఇ సిద్ధారెడ్డి, పాడా ప్రత్యేక అధికారి అనిల్‌ కుమార్‌రెడ్డి ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
సిఎం పర్యటన ఇలా...
కడప : సిఎం జగన్‌ రెండు రోజులు అన్నమయ్య, కడప జిల్లాల్లో పర్యటిస్తారని కలెక్టర్‌ విజరురామరాజు పేర్కొన్నారు. గురువారం విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో కడపకు 10.30 గంటలకు చేరుకుంటారు. అక్కడి నుంచి రాయచోటికి హెలికాప్టర్‌లో 11:50 గంటలకు చేరుకుంటారు. స్థానికంగా రెండు వివాహ వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం హెలికాప్టర్‌లో 1:30 గంటలకు పులివెందులకు చేరుకుంటారు. స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొంటారు. 4.30 గంటలకు ఇడుపులపాయకు చేరుకుని అక్కడే బస చేస్తారు. శుక్రవారం 8:30 గంటలకు ఆర్కే వ్యాలీ పోలీస్‌స్టేషన్‌, జమ్మలమడుగు పోలీస్‌ స్టేషన్‌ ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం 9:00 గంటల నుండి 11:30 గంటల వరకు అక్కడి ప్రజలతో మమేకమై మాట్లాడుతారు. అనంతరం అక్కడి నుండి రోడ్డు మార్గాన బయలుదేరి 11:35 గంటలకు వైయస్సార్‌ ఎస్టేట్‌ గెస్ట్‌ హౌస్‌కు చేరుకుంటారు. 11:55 గంటలకు అక్కడనుండి హెలికాప్టర్‌లో బయలుదేరి మధ్యాహ్నం 12:15 గంటలకు కడప విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడ నుండి విమానంలో బయలుదేరి 1:10 గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. రోడ్డు మార్గాన బయలుదేరి 1:35 గంటలకు తన నివాసానికి సిఎం చేరుకుంటారు.