Aug 06,2023 23:44

ప్రజాశక్తి-సామర్లకోట రూరల్‌ ఈ నెలాఖరున ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పర్యటనకు సంబందించిన ఏర్పాట్లను సిఎం ప్రోగామ్‌ కో ఆర్డినేటర్‌, ఎంఎల్‌సి తలశిల రఘురాం, జెసి ఎస్‌.ఇలాక్కియ ఆదివారం పరిశీలించారు. ఎపీ స్టేట్‌ హౌసింగు కార్పోరేషన్‌ చైర్మన్‌ దవులూరి దొరబాబు ఆధ్వర్యంలో రఘురామ్‌ పర్యటించారు. తొలుత పెద్దాపురం రోడ్డులోని హెలిప్యాడ్‌ను పరిశీలించారు. అనంతరం జి.రాగంపేట రోడ్డులో జగనన్న కాలనీలో గృహాలను, మౌలిక వసతులను, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసే సభా వేదికలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డిఒలు ఎన్‌వివి.సత్యనారాయణ, జె.సీతారామారావు, పెద్దాపురం డిఎస్‌పి లతాకుమారి, హౌసింగ్‌ పీడీ సుధాకర్‌ పట్నాయక్‌ సిఐ కె.దుర్గాప్రసాద్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఊబా జాన్‌ మోజెస్‌, వైసిపి రాష్ట్ర కార్యదర్శి ఆవాల లకీëనారాయణ, వైసిపి కౌన్సిలర్‌లు సేపేని సురేష్‌, పాగా సురేష్‌ కుమార్‌, పలు శాఖల అధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.