ప్రజాశక్తి -యంత్రాంగం వైసిపి ఆధ్వర్యాన శుక్రవారం పలుచోట్ల జగనే ఎందుకు రావాలి కారక్రమాలు నిర్వహించారు. పెద్దాపురం ప్రజల సంక్షేమం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ద్వారానే సాధ్యమవుతుందని హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దవులూరి దొరబాబు అన్నారు. 1, 2 వార్డుల సచివాలయాల పరిధిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఛైర్‌పర్సన్ బొడ్డు తులసి మంగతాయారు, వైస్ చైర్మన్లు నెక్కంటి సాయి ప్రసాద్, కనకాల మహాలక్ష్మి, మున్సిపల్ కౌన్సిలర్లు ఆరెళ్ల వీర రాఘవ, ఆకుల కృష్ణ బాపూజీ, త్సలికి సత్యభాస్కరరావు, వైసిపి పట్టణ అధ్యక్షుడు కాపుగంటి కామేశ్వరరావు, రాజా, హరిబాబు, పెద్దకాపు, భీమరాజు, చింతా శ్రీనివాసరావు, బొడ్డు ప్రకాష్ పాల్గొన్నారు. గండేపల్లి తాళ్లూరు సచివాలయంలో ఎంఎల్‌ఎ జ్యోతుల చంటిబాబు మాట్లాడారు. ఒబిన్ని వీరబాబ, వైస్ ఎంపిపి కుంచే రాజా, కందుల చిట్టిబాబు, సర్పంచులు పోకల సుబ్బారావు, అడబాల ఆంజనేయులు, ములంపాక సురేష్ బాబు పాల్గొన్నారు. మల్లేపల్లిలో రామకుర్తి బ్రహ్మాజీ ఆధ్వర్యాన నిర్వహించిన కార్యక్రమంలో తోట రామ్‌జీ, రామకుర్తి శ్రీరామచంద్రమూర్తి, గుల్లా ఏడుకొండలు, కుంచే చినబాబు, కోర్పు దుర్గాప్రసాద్, ఓబిన్ని సత్యనారాయణ, అత్తులూరి సాయిబాబు, గఫూర్, తోట అయ్యన్న పాల్గొన్నారు. జగ్గంపేట రూరల్ మల్లిసాలలో ఎంపిడిఒ వసంత కుమార్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ఎంపిపి అత్తులూరి నాగబాబు, ఒమ్మి రఘురామ్ పాల్గొని ప్రసంగించారు. ఇఒపిఆర్‌డి కొండలరావు, జెసిఎస్ కన్వీనర్ బండారు రాజా, నాయకులు అత్తులూరి శ్రీను, పారిపిరెడ్డి కోదండ, నక్కరాజు వీరబాబు, ముత్తా రాజబాబు, గనియ్య పాల్గొన్నారు. సామర్లకోట రూరల్ సీతాఫల్ దొడ్డి సచివాలయం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దవులూరి దొరబాబు, ఆవాల లక్ష్మీనారాయణ, ఆవాల రాజేశ్వరి, కమిషనర్ రామారావు, మున్సిపల్ చైర్‌పర్సన్ గంగిరెడ్డి అరుణ కృష్ణమూర్తి, వైస్ చైర్మన్ ఊబా జాన్ మోజెస్, మద్దాల శ్రీనివాస్ పాల్గొన్నారు.