Jul 12,2023 22:20

ఫొటో : గడపగడపకు మనప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తున్న ఎంఎల్‌ఎ నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి

సిఎం జగన్‌పై ప్రజల విశ్వాసం
ప్రజాశక్తి-ఇందుకూరుపేట : ప్రజా విశ్వాసం పొందిన ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి రాష్ట్ర ప్రజానీకం మన్ననలను పొందారని ఎంఎల్‌ఎ నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మండలంలోని కొమరిక గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వం ద్వారా అందుతున్న సంక్షేమ పథకాల బుక్‌లెట్‌ను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా అమలు చేయడాన్ని వివరించారు.
లబ్ధిదారులకు నేరుగా వారివారి ఖాతాలలో జమ కావడాన్ని పేర్కొన్నారు. కొన్ని ప్రతిపక్షాలు ప్రభుత్వంపై అనవసర విమర్శలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. 2024 ఎన్నికలలో తిరిగి వైసిపి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కార్యక్రమంలో మండల కన్వీనర్‌ మావులూరు శ్రీనివాసులు రెడ్డి, రాష్ట్ర పశు గణాభివృద్ధి సంస్థ చైర్మన్‌ గొల్లపల్లి విజరుకుమార్‌ యాదవ్‌, గూడూరు ప్రభాకర్‌ రెడ్డి, గూడూరు శివకుమార్‌ రెడ్డి, తిక్కవరపు సుధాకర్‌ రెడ్డి, సర్పంచ్‌ తిక్కవరపు వసుంధరమ్మ, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.