ప్రజాశక్తి - తాళ్లరేవు మండలంలోని జార్జిపేట పంచాయతీ ఎంఎల్‌కె.నగర్‌కు చెందిన వైసిపి సీనియర్ నాయకుడు, వ్యవసాయ శాఖ విశ్రాంత జెడి పెట్ల సూర్యనారాయణ రాజు సిఎం. జగన్ మోహన్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఉద్యోగ విరమణ చేసినప్పటి నుంచి పార్టీలో క్రియాశీలక కార్యకర్తగా పని చేస్తున్నానని సిఎం జగన్ దష్టికి తీసుకెళ్లారు. ముమ్మిడివరం నియోజకవర్గవ్యాప్తంగా పార్టీ గెలుపు కోసం 4 మండలాల్లో పాదయాత్ర చేసినట్లు తెలిపారు. తనకు పార్టీలో సముచిత స్థానం కల్పించాలని సిఎం జగన్‌ను కోరినట్లు సూర్యనారాయణ రాజు తెలిపారు. దీనిపై సిఎం వైఎస్.జగన్ సానుకూలంగా స్పందించి పార్టీ ఉభయ గోదావరి జిల్లాల ఇన్‌ఛార్జి మిథున్ రెడ్డికి సూచించారని రాజు తెలిపారు.










