Nov 06,2023 21:01

హెలీప్యాడ్‌ ప్రాంతాన్ని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, అధికారులు

రాయచోటి : రాయచోటికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 9న రానున్న నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లును ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, శాసన మండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌ జకియా ఖానం, మున్సిపల్‌ చైర్మన్‌ ఫయాజ్‌బాష, డిఎస్‌పి మహబూబ్‌ బాష, ఆర్‌అండ్‌బి, మున్సిపల్‌ అధికారులుతో కలసి పరిశీలించారు. శాసన మండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌ జకీయా ఖానం కుమారుని వివాహ రిసెప్షన్‌ రాయచోటి పట్టణంలోని అభి కల్యాణ మండపంలోనూ, మాసాపేటకు చెందిన కీ శే జిఎండి రఫీ సోదరుని కుమార్తె వివాహం పట్టణంలోని రాజధాని కల్యాణ మండపంలో నిర్వహించనున్నారు. వివాహ కార్యక్రమాలకు సిఎం జగన్‌ హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియచేయనున్నారు. ఈ సందర్భంగా పర్యటనా ఏర్పాట్లును శ్రీకాంత్‌రెడ్డి పరిశీలించారు. రాజధాని కల్యాణ మండపం వెనుక భాగంలోనే ఏర్పాటు చేస్తున్న హెలిప్యాడ్‌ నిర్మాణాల పనులును, హెలిప్యాడ్‌ నుంచి కల్యాణ మండపాలకు వెళ్లే రహదారుల మరమ్మతు పనులపై అధికారులతో చర్చించారు. అధికారుల సమన్వయంతో ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి కోరారు. ఎలాంటి పొరబాట్లు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సిఐ సుధాకర్‌ రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ గంగా ప్రసాద్‌, వైఎస్‌ఆర్‌సిపి మైనారిటీ జిల్లా అధ్యక్షుడు బేపారి మహమ్మద్‌ఖాన్‌, ఆర్‌అండ్‌బి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ వెంకట సుబ్బయ్య, అసిస్టెంట్‌ ఇంజినీరు గిరీశ్వర రావు, మున్సిపల్‌ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ మల్లికార్జున, కౌన్సిలర్లు ఆసీఫ్‌ అలీఖాన్‌, సుగవాసి ఈశ్వర్‌ ప్రసాద్‌, షబ్బీర్‌, జానం రవీంద్ర యాదవ్‌,నాసీర్‌, బిసి సెల్‌ విజయ భాస్కర్‌, జిఎండి ఇమ్రాన్‌, ఇర్షాద్‌, కో-ఆప్షన్‌ హజరత్‌ ఖాదర్‌ వలీ, ఆర్ట్స్‌ శంకర్‌, నవాజ్‌ క్రిష్‌ పాల్గొన్నారు.