కడప అర్బన్ : ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం మహిళా పక్షపాతిగా అన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్.బి అంజాద్ బాషా పేర్కొన్నారు. గురువారం స్థానిక 1 వ టౌన్ పరిధిలోని దిశ పోలీస్ స్టేషన్ వద్ద పట్టణ పేదరిక నిర్ములన సంస్థ, మున్సిపల్ కార్పొరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అర్బన్ మెప్మా బజర్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలు చేసిన ఉత్పత్తులన్నీ అర్బన్ మెప్మా బజార్‌లో విక్రయించ వచ్చ న్నారు. ముఖ్యమంత్రి మహిళలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. కుటుంబ బరువు బాధ్యతలు మహిళలు మాత్రమే మోస్తారని కాబట్టి కచ్చితంగా వారి ఖాతాలోనే డబ్బులు వేస్తేనే అవి పూర్తిస్థాయిలో సద్వినియోగం అవుతాయని పేర్కొన్నారు. 40 సంవత్సరాల నుంచి 60 సంవత్స రాలలోపు ఉన్న మహిళలందరికీ వైఎస్‌ఆర్ చేయూత వర్తింప జేస్తున్నారని చెప్పారు. ఆహా క్యాంటీన్ ఒక అద్భుతమైన కాన్సెప్ట్ అని స్వయం సహాయక బందాల మహిళలు పట్టణ ప్రాంతంలో ఆహా క్యాంటీన్‌లను ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. కార్యక్ర మంలో మెప్మా ఎమ్‌డి విజయలక్ష్మి, సురేష్‌రెడ్డి, స్టేట్ ఎస్‌ఎంసి ఆదినారాయణ, ఎస్‌హెచ్‌జి గ్రూప్‌ల మహిళలు పాల్గొన్నారు.










