కడప అర్బన్: అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలను వేధిస్తున్న కడప సిడిపిఒ సునందను సస్పెండ్ చేయాలని సిఐ టియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి.మనోహర్ డిమాండ్ చేశారు. గురు వారం కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2017, 18 ఏడాదిలో పదవీ విరమణ పొందిన వారికి బెనిఫిట్స్ ఇవ్వాలని స్పందనలో ఐసిడిఎస్ పిడి, కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చామని పేర్కొన్నారు. దీనిపై కక్షపెంచుకుని కార్యకర్తలు, ఆయాలను వేధించడం సరికాదని చెప్పారు. ఉదయం 8.40 గంటలకే కేంద్రం వద్ద ఉండాలని, 9 గంటలకే పిల్లలు ఉండాలంటూ తనిఖీలు నిర్వహించడం ఎంతవరకు సమం జసమని ప్రశ్నించారు. అర్హులైన వారికి పదోన్నతు ఇవ్వకుండా, టిఎ, డిఎలు, గ్యాస్ బిల్లులు, సెంటర్ల అద్దెలు, జీతాలు ఇవ్వకుండా పనులు మాత్రం చేయాలనడం సరికాదని చెప్పారు. యాప్‌ల పేరుతో వేధిస్తున్నారని తెలిపారు. రేషన్ షాపుల నుంచి స్టాక్ సెంటర్లకు చేర్చాల్సి ఉన్నా చేర్చడం లేదని పేర్కొన్నారు. బదిలీలు చేయమంటే ఇబ్బం దిపెడుతున్నారని చెప్పారు. కార్యకర్తలు, ఆయాలకు సిఐటియు అండగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి వెంకటసుబ్బయ, ఎపి అంగన్‌వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.లక్ష్మిదేవి, నాయకులు అంజనీదేవి, వినీల, మెర్సీ, దీప, కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు.










