(పజాశక్తి-నందిగామ
ఈనెల ఆరోతేదీన రాష్ట్రవ్యాప్తంగా ఎపి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు అనుబంధం) ఆధ్వర్యంలో జరిగే సమ్మెలో పాల్గొంటున్నామని తెలియజేస్తూ నందిగామ ఐసిడిఎస్ అధికారికి శుక్రవారం సమ్మె నోటీస్‌ను సిఐటియు నాయకులు అందజేశారు. సిఐటియు నందిగామ మండల కార్యదర్శి కె.గోపాల్ మాట్లాడుతూ అంగన్వాడీ ఉద్యోగులకు కనీస వేతనాలు ఇవ్వాలన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ ఇవ్వాలనీ, పేస్ రికగేషన్ యాప్ రద్దు చేయాలని కోరారు. అంగన్వాడీ కేంద్రాలకు మౌలిక వసతులు కల్పించాలని కోరారు. విజయవాడలో జరిగే మహాధర్నాకు తరలిరావాలని అంగన్వాడీ ఉద్యోగులను కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ ప్రాజెక్టు నాయకురాలు కె.సరళ, ఫాతిమా, పద్మ పాల్గొన్నారు.










