
విజయవాడ : సిద్ధార్థ సోషల్ సర్వీస్ సొసైటీ విజయవాడవారు డాక్టర్స్ బ్లడ్ బ్యాంక్ విజయవాడవారి సౌజన్యంతో గత బుధవారం విజయవాడ కోర్టు సెంటర్ సిఎస్‌ఐ కాంప్లెక్స్ ఎదురుగా 2500 మందికి మజ్జిగ, కూల్‌వాటర్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు విచ్చేసి చలివేంద్రాన్ని ప్రారంభించారు. సిద్దార్థ సోషల్ సర్వీస్ సొసైటీ సెక్రటరీ నీలం మాధవి పుష్పగుచ్ఛాన్ని చైర్మన్‌కు అందించి స్వాగతం పలికారు. డాక్టర్స్ బ్లడ్ బ్యాంక్ డైరెక్టర్ నీలం గోపికృష్ణ శాలువాతో చైర్మన్ శేషుని సత్కరించారు. ఈ కార్యక్రమంలో అడపా శేషు మాట్లాడుతూ ... నక్కల రోడ్డులో ఉన్న ఆసుపత్రులకు వచ్చే రోగులకు, కోర్టు పనులకు వెళ్లేవారికి, చిరువ్యాపారులకు, పాదచారులకు ఈ చలివేంద్రం సహాయకరంగా ఉంటుందన్నారు. మండుటెండలో వెళ్లేవారు చల్లని నీళ్లు తాగేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన సిద్ధార్థ సోషల్ సర్వీస్ సొసైటీవారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ నెంబర్ తోటా సాంబయ్య, బ్లడ్ బ్యాంక్ సిబ్బంది... డాక్టర్స్ బ్లడ్ బ్యాంక్ మార్కెట్ మేనేజర్ వి.సూర్య ప్రకాశ్, టెక్నికల్ సూపర్‌వైజర్ ఎం.కిరణ్ బాబు, సొసైటీ సిబ్బంది.. మున్నా, నిరీక్షణ్, సుజాత, సోమశేఖరరావు, సాయిరాం, సాత్విక్, లూదియా, శ్రీనివాసరెడ్డి, సురేశ్ అండ్ కో సురేశ్‌బాబు, తదితరులు పాల్గొన్నారు.