పోలీసు సిబ్బంది నుంచి అర్జీలు స్వీకరిస్తున్న ఎస్‌పి సిద్ధార్థ కౌశల్
కడప అర్బన్ : పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారం కోసం శుక్రవారం ఎస్‌పి సిద్ధార్థ్ కౌశల్ జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు గ్రీవెన్స్ డే నిర్వహించారు. జిల్లాలో వివిధ పోలీసు స్టేషన్లు, ఆయా విభాగాలలో విధులు నిర్వర్తిస్తున్న పోలీసు సిబ్బంది మొత్తం 25 మంది బదిలీలు, వ్యక్తిగత, స్పౌస్, చిల్డ్రన్స్ మెడికల్ సమస్యల గురించి ఎస్‌పికి స్వయంగా విన్నవించుకున్నారు. సమస్యలకు తగిన పరిష్కారం చూపుతామని సిబ్బందికి భరోసా కల్పించారు. ఫిర్యాదుల సమస్యలను పరిష్కరించాలని సంబంధిత జిల్లా పోలీసు కార్యాలయ అధికారులను ఆదేశించారు.










