
సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యత
- జిల్లా ఎస్‌పి కె.రఘువీర్ రెడ్డి
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్
పోలీసు సిబ్బంది సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తూ, వారి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రీవియన్స్ డే నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ కె.రఘువీర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు గ్రీవియన్స్ డే నిర్వహించారు. జిల్లాలోని వివిధ పోలీసు స్టేషన్లు, ఆయా విభాగాలలో విధులు నిర్వర్తిస్తున్న నలుగురు సిబ్బంది మ్యూచువల్ ట్రాన్స్‌ఫÛర్, మెడికల్ గ్రౌండ్స్, రిక్వెస్ట్ బదిలీలపై జిల్లా ఎస్పీకి విన్నవించుకున్నారు. ఎస్పీ వారి సమస్యలకు తగిన పరిష్కారం చూపుతామని సిబ్బందికి భరోసా కల్పించారు. ఎస్‌పి మాట్లాడుతూ పోలీస్ సిబ్బంది సంక్షేమానికి తగిన ప్రాధాన్యత ఇస్తూ, వారి సమస్యల పరిష్కరానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రతి శుక్రవారం నిర్వహించే పోలీస్ వెల్ఫేర్ డే కార్యక్రమంలో సిబ్బంది సమస్యలను నిర్భయంగా తెలియజేసుకోవచ్చని పేర్కొన్నారు. విధినిర్వహణలో సిబ్బంది సతమత పడకుండా వారి సమస్యలను తొలగించి ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా చెయ్యడమే లక్ష్యమన్నారు.