Sep 04,2023 21:34

ప్రజాశక్తి - ఆచంట
          ఉపాధి హామీ చట్టం సిబ్బంది విధులు సక్రమంగా నిర్వహించాలని డ్వామా పీడీ రాజేశ్వరరావు అన్నారు. 2022-2023 సంవత్సరానికి మండలంలో చేపట్టిన ఉపాధి హామీ చట్టానికి సంబంధించి సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమం ఎంపిపి సూర్య కుమారి అధ్యక్షతన సోమవారం స్థానిక ఎంపిడిఒ కార్యాలయ ఆవరణలో నిర్వహి ంచారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ పనుల విషయంలో చోటు చేసుకున్న అవకత వకలను డిఆర్‌పిలు ప్రజావేదికలో వెల్లడించారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్‌ ఎపిడి వీరాస్వామి, జిల్లా విజిలెన్స్‌ అధికారి విజయలక్ష్మి, ఎంపిడిఒ విఎస్‌విఎల్‌.జగన్నాధరావు పాల్గొన్నారు.