ప్రజాశక్తి-సీలేరు
జికె.వీధి మండలం దుప్పిలివాడ పంచాయతీ, బూసికొండ గ్రామంలో సిఆర్‌పిఎఫ్ 42 బెటాలియన్ ఆధ్వర్యాన మంగళవారం సివిక్ యాక్షన్ ప్రోగ్రాం నిర్వహించారు. ఇందులో భాగంగా 50 మంది గిరిజన రైతులకు వ్యవసాయ పనిముట్లు, 20 రేడియోలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. వైద్యులు నితిల్ కుమార్, సౌమ్య గిరిజనులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిఆర్‌పిఎఫ్ 42 బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ సురేష్, డిప్యూటీ కమాండెంట్ (రాజమండ్రి) బి రత్నమ్మ మాట్లాడుతూ సివిక్ యాక్షన్ ప్రోగ్రాం ద్వారా పెద్దబూషికొండ, చిన్న బూషికొండ, పార్వతి నగర్ తదితర గ్రామాల్లో గిరిజన రైతులకు వ్యవసాయ పనిముట్లు అందించినట్లు చెప్పారు. సీలేరు ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు ఉచితంగా కంప్యూటర్ సిస్టమ్‌ని అందజేశారు. అనంతరం ఏపీ గురుకుల పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు నిర్వహించిన సాంస్కతిక ప్రదర్శనల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగద పురస్కారాలు అందజేశారు. అనంతరం గిరిజనులతో సిఆర్‌పిఎఫ్ పోలీసులు సహపంక్తి భోజనాలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ పిల్ల సాంబమూర్తి, కాంగ్రెస్ నాయకులు కారే శ్రీనివాస్, సివిల్ సిఆర్‌పిఎఫ్ పోలీసులు పాల్గొన్నారు.
చింతూరు : చింతూరు మండలం, ఏడుగురాళ్లపల్లిలో సిఆర్పిఎఫ్ 141 బెటాలియన్ కమాండెంట్ ప్రశాంత్ ధర్ ఆదేశాలు మేరకు మంగళవారం సివిక్ యాక్షన్ ప్రోగ్రాం నిర్వహించారు. ఏడుగురాళ్లపల్లి, పంచాయితీ విద్యానగరం, మద్దిగూడెంలో స్థానిక కొండరెడ్లకి, ఆదివాసీలు 300 మందికి బియ్యం, డ్రమ్ములు, కళాయిలు, కంచాలు, గ్లాసులు అందజేశారు. అంగనవాడీ చిన్నపిల్లలకు, ఆయా గ్రామాల్లో స్కూల్ పిల్లలకు కంచాలు, గ్లాసులు అందజేశారు. ఈ సందర్భంగా సిఆర్పిఎఫ్ డి 141 బి.ఎన్న వోసి టి కృష్ణారావు మాట్లాడుతూ ఏజెన్సీలోని యువత చెడు మార్గాలలోకి వెళ్ళవద్దని, మద్యానికి మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని హితవుపలికారు. ఈ కార్యక్రమంలో సిఆర్పిఎఫ్ సెకండ్ హ్యాండ్ కమాండెంట్ కమల్ వీర్ యాదవ్, సిఆర్పిఎఫ్‌డి 141 ఓసి టి.కృష్ణారావు, చింతూరు సీఐ అప్పలనాయుడు, ఎస్సై శ్రీనివాసరావు, సర్పంచులు సవలం సత్తిబాబు, సిఆర్పిఎఫ్, స్కూల్ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.










