Oct 29,2022 23:56

విద్యార్థులకు స్టడీ మెటీరియల్‌ ఇస్తున్న రామారావు

విద్యాప్రదాతగా స్వచ్ఛందంగా విశేషమైన సేవలు
ప్రజాశక్తి -కొత్తకోట :
రావికమతం మండలం టి అర్జాపురం క్లస్టర్‌ సిఆర్‌పి గుంటూరు రామారావు విద్య, అనుబంధ కార్యక్రమాలను నిర్వహిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎన్‌ఎంఎంఎస్‌ ఉపకార వేతనాలు పొందేందుకు శిక్షణ పొందుతున్న నిరుపేద విద్యార్థులకు సుమారు రూ. ఆరు వేల విలువైన పుస్తకాలను ఉచితంగా అందించారు. తనకు వచ్చిన కొద్దిపాటి వేతనంలోనూ కొంత మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు కేటాయిస్తూ, పేద విద్యార్థులకు పోటీ పరీక్షలకు కావాల్సిన పుస్తకాలను కొనుగోలు చేసి అందిస్త్తున్నారు. ఏటా జిల్లా స్థాయిలో జరిగే ఎన్‌ఎంఎంఎస్‌ ఉపకార వేతనాలకు నిర్వహించే పోటీ పరీక్షలకు పాఠశాల తరుపున పాల్గొనే నిరుపేద విద్యార్థులకు ఉచితంగా శిక్షణనివ్వడమే కాకుండా, వారికి అవసరమైన మెటీరియల్‌ కూడా సమకూర్చుతున్నారు. ఐదు, ఆరు తరగతుల్లో విద్యార్థులు వివిధ రకాల గురుకుల పాఠశాలకు ఎంపికయ్యేందుకు ఉచిత శిక్షణ, సాయం అందిస్తున్నారు. అలాగే గ్రామంలో కాలుష్య నివారణకు తనవంతు కృషిలో భాగంగా ప్లాస్టిక్‌ నియంత్రణకు గ్రామస్తులకు గుడ్డ సంచులు పంపిణీ, విరివిగా మొక్కలు నాటడం, వాటి సంరక్షించడం వంటి సేవా కార్య క్రమాలు చేస్తూ పలువురు దాతలకు గుంటూరు రామారావు ఆదర్శంగా నిలుస్తూన్నారు