Dec 29,2022 21:59

ప్రజాశక్తి - టి.నరసాపురం
            వచ్చేనెల 2, 3, 4 తేదీల్లో పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణంలో జరిగే సిఐటియు రాష్ట్ర మహాసభను జయప్రదం చేయాలని సిఐటియు మండల కార్యదర్శి కెవివి.సత్యనారాయణ, జిల్లా నాయకులు తుమ్మల సత్యనారాయణ పిలుపునిచ్చారు. టి.నరసాపురంలో గురువారం అంగన్వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ (సిఐటియు) యూనియన్‌ సమావేశం యూనియన్‌ సెక్టార్‌ లీడర్‌ జాన్సీ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా మహాసభ పోస్టర్లను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు, అంగన్‌వాడి వర్కర్స్‌ పాల్గొన్నారు.
ఉంగుటూరు : సిఐటియు రాష్ట్ర మహాసభను జయప్రదం చేయాలని ఎపి అంగన్వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా గౌరవాధ్యక్షులు కె.విజయలక్ష్మి పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం స్కీమ్‌ వర్కర్స్‌ యూనియన్ల బృందం ఉంగుటూరు మండలంలో పర్యటించింది. అంగన్వాడీలు, ఆశాలు, మధ్యాహ్న భోజనం కార్మికులను ప్రత్యక్షంగా బృందం కలిసింది. ఈ సందర్భంగా ఆశా వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు కె.పోశమ్మ మాట్లాడారు. మండలంలోని కైకరం, చేబ్రోలు, నారాయణపురం, ఉంగుటూరు, బాదంపూడి గ్రామాల్లో బృందం పర్యటించింది. ఈ సందర్భంగా రాష్ట్ర మహాసభ గోడపత్రికలు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి కె.వెంకట్రావు, ఆశా వర్కర్స్‌ యూనియన్‌ ఏలూరు నగర కార్యదర్శి సిహెచ్‌.దేవి, అంగన్వాడీలు, ఆశాలు, మధ్యాహ్న భోజన కార్మికులు పాల్గొన్నారు.
భీమడోలు : సిఐటియు 16వ రాష్ట్ర మహాసభను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్‌.లింగరాజు పిలుపునిచ్చారు. మహాసభ సన్నాహక చర్యల్లో భాగంగా గురువారం ఆయన భీమడోలు మండలంలో పర్యటించారు. పాతూరులోని రాష్ట్ర పౌర సరఫరాల గోదాము హమాలీ కార్మికుల యూనియన్‌ సభ్యులను కలిశారు. వారితో కలిసి సిఐటియు మహాసభ గురించి వివరిస్తూ .భీమడోలు లో మోటార్‌ సైకిల్‌ ర్యాలీ ని నిర్వహించారు కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు నాగేశ్వరరావు, రాంబాబు పాల్గొన్నారు.