ప్రజాశక్తి - వేలేరుపాడు
సిఐటియు రాష్ట్ర మహాసభను జయప్రదం చేయాలిభీమవరంలో జరిగే సిఐటియు రాష్ట్ర 16వ మహాసభను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి మడివి దుర్గారావు పిలుపునిచ్చారు. వేలేరుపాడులోని ఆటో యూనియన్ ప్రాంగణంలో మహాసభ గోడపత్రికలను గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల సమస్యలపై సిఐటియు అలుపెరగని పోరాటం చేస్తుందన్నారు. ఈ మహాసభకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ముఖ్యఅతిథిగా విచ్చేస్తున్నారని తెలిపారు. కార్మికులు, ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి బి.వెంకటేశ్వర్లు ఫ్రెండ్స్ ఆటో యూనియన్ ప్రెసిడెంట్ కురిమెళ్ల శ్రీను, గెడ్డం మల్లేశ్వరరావు, మజ్జి శ్రీను, వాదం సతీష్ పాల్గొన్నారు.
బుట్టాయగూడెం:వచ్చేనెల 2, 3, 4 తేదీల్లో భీమవరంలో జరిగే సిఐటియు రాష్ట్ర మహాసభను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి మొడియం నాగమణి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా స్థానికంగా వాల్‌పోస్టర్‌ను గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాగమణి మాట్లాడుతూ ఈ సభకు మండలం లోని స్కీం వర్కర్లు, బిల్డింగ్, ఆటో కార్మికులు, కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ కార్మికులు పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి పి.రాజు, జయరాజు, మణికల మంగరాజు, అల్లూరి మోహన్ కృష్ణారెడ్డి, రామచంద్రరావు, రాంబాబు పాల్గొన్నారు.
నూజివీడు:భీమవరంలో వచ్చేనెల రెండు, మూడు, నాలుగు తేదీల్లో జరిగే సిఐటియు రాష్ట్ర 16వ మహాసభను జయప్రదం చేయాలని కోరుతూ నూజివీడు సిఐటియు నాయకులు, కార్యకర్తలు గోడిపతులను గురువారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు జి.రాజు, కొండలు, రవి, అశోక్ రాజు, మౌలాలి పాల్గొన్నారు.










