Dec 27,2022 21:54

ప్రజాశక్తి - చాట్రాయి
           వచ్చేనెల 2,3,4 తేదీల్లో పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జరిగే సిఐటియు రాష్ట్ర 16వ మహాసభను జయప్రదం చేయాలని సిఐటియు మండల కార్యదర్శి కె.భాస్కర్‌రావు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మిక రంగ కార్మికులు, పెయింటింగ్‌ వర్కర్స్‌, ఎలక్ట్రికల్‌ వర్కర్స్‌, ఆశ, అంగన్వాడీ కార్యకర్తలు భీమవరంలో మహాసభను జయప్రదం చేయాలని కోరారు. అనంతరం ఆశా వర్కర్స్‌ యూనియన్‌(సిఐటియు) నాయకులు సింగనపల్లి పుల్లమ్మ మాట్లాడారు.
కుకునూరు : సిఐటియు రాష్ట్ర మహాసభను జయప్రదం చేయాలని యూనియన్‌ జిల్లా నాయకులు యర్నం సాయికిరణ్‌ కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు గోడ పత్రికలను సిఐటియు ఆధ్వర్యంలో జిసిసి కార్యాలయంలోని హమాలీ కార్మికులతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా సాయికిరణ్‌ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కమిటీ సభ్యులు టి.సురేష్‌, హమాలీలు వేల్పుల శివ, లాడే వెంకట్రావు, దార చినరాజు, నరసింహారావు, శకపల్లి నాగార్జున, గరీబ్‌, సికిందర్‌, సాయిరాం పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడెం : సిఐటియు రాష్ట్ర మహాసభను జయప్రదం చేయాలని ఆ యూనియన్‌ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు పసల సూర్యారావు, ఎస్‌కె.సుభాషిణి పిలుపునిచ్చారు. మహాసభను జయప్రదం చేయాలని కోరుతూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. స్థానిక ప్రజా సంఘాల కార్యాలయం నుండి అశ్వరావుపేట రోడ్డు, కాకర్ల జంక్షన్‌, బిఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయం, మార్కెట్‌ రోడ్‌ మీదుగా పొట్టి శ్రీరాములు విగ్రహం వరకూ ర్యాలీ నిర్వహిం చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ అధ్యక్షులు పసుల సూర్యరావు, సిఐటియు నాయకులు బాలరాజు, మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు బి.బాలరాజు, జి.లక్ష్మణ్‌, ఆర్‌.నాగరాజు, పెంటయ్య, రాజు పాల్గొన్నారు.
చింతలపూడి : సిఐటియు రాష్ట్ర మహాసభను చేయాలని సిఐటియు మండల అధ్యక్షులు నత్త వెంకటేశ్వరావు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పట్టణంలో గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి బాలరాజు, అంగన్‌వాడీ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు పి.సరోజని, టి.మాణిక్యం, ఆశా వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు సరళ, దివ్య, మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు వి.పద్మ, టి.వల్లి, వంశీ, డి.నాగమణి పాల్గొన్నారు.