Dec 28,2022 23:07

ప్రజాశక్తి-ఇబ్రహీంపట్నం

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న విధానాలతో ఉద్యోగులు కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడతున్న ప్రస్తుత తరుణంలో కార్మికుల ఎదుర్కొంటున్న సమస్యలపై భీమవరంలో జనవరి 2 నుండి 4 వరకు జరిగే సిఐటియు 16వ రాష్ట్ర మహాసభను జయప్రదం చేయాలని సిఐటియు నాయకులు మహేష్‌ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మహాసభను జయప్రదం చేయాలని కోరుతూ గోడపత్రికను బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులకు నష్టదాయకమైన లేబర్‌కోడ్స్‌ను రద్దు చేయాలని, కార్మికులను కనీస వేతనం రూ.26వేలు అమలు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఆఫీసులో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులందరినీ పర్మినెంట్‌ చేయాలని, సంక్షేమ పథకాల అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలన్నారు. సిఐటియు మండల అధ్యక్షులు కె వాసుదేవన్‌, ఉపాధ్యక్షులు కొండలరావు, బాపూజీ హాకర్స్‌ యూనియన్‌ ప్రెసిడెంట్‌ రమణమ్మ, కోశాధికారి నవీన్‌ ,మధ్యాహ్నం భోజన పథకం వర్కర్స్‌ యూనియన్‌ ప్రెసి డెంట్‌ కె రాజేశ్వరి తదితరులు పాల్గొన్నా రు