Dec 10,2022 23:38

కరపత్రాలు పంపిణీ చేస్తున్న సిఐటియు నాయకులు

ప్రజాశక్తి-ముంచింగిపుట్టు: అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు కేంద్రంలో ఈనెల 20, 21వ తేదీల్లో జరిగే సిఐటియు ప్రధమ మహాసభలను కార్మికులు జయప్రదం చేయాలని సిఐటియు మండల కార్యదర్శి కె.శంకర్రావు పిలుపునిచ్చారు. ఈ మేరకు మండల కేంద్రంలో శనివారం జరిగిన వారపు సంతలో సిఐటియు నాయకులు ప్రచారం నిర్వహించారు. మహాసభల కరపత్రాలను కార్మికులకు అందజేశారు. అనంతరం ఈ సందర్భంగా శంకర్‌రావు మాట్లాడుతూ, కార్మికులు పని చేసే చోట మౌలిక సౌకర్యాలు కల్పన, ఉద్యోగ భద్రత, కనీస వేతనం వంటి సమస్యల పరిష్కారం, భవిష్యత్‌ కార్యాచరణ రూపొందించేందుకు ఈ మహాసభలు వేదిక కానున్నాయని ఆయన అన్నారు. ఆటో కార్మికుల యూనియన్‌ భవనం ఏర్పాటు, ఆటో పార్కింగ్‌ ఏర్పాటు వంటి సమస్యలపై ఈ మహాసభల్లో ఏజెండా అంశాలుగా రూపొందించడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం మండల అధ్యక్షుడు జి.నారాయణ, కార్యదర్శి ఎంఎం శ్రీను, ఎస్‌.గాసిరందొర, బలరాం, డొంబ్రు, ఆటో యూనియన్‌ ప్రెసిడెంట్‌ కృష్ణ, శేషాద్రి తదితరులు పాల్గొన్నారు.