పోస్టర్ విడుదల చేస్తున్న నాయకులు
ప్రజాశక్తి-నర్సీపట్నం టౌన్: ఈనెల 18, 19 తేదీల్లో పరవాడలో జరిగే సిఐటియు 12వ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు డి సత్తిబాబు కార్మికులకు పిలుపునిచ్చారు. స్థానిక ఐదు రోడ్డు సెంటర్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మికులకు కనీస వేతనాలు చెల్లించి, కార్మిక చట్టాలను రద్దు చేయాలన్నారు. కార్మికుల సమస్యలను చర్చించి పోరాటం రూపొందిస్తామన్నారు. ఈ మహాసభలను జయప్రదం చేసేందుకు అందరూ సహకరించాలని, 18వ తేదీన జరిగే ప్రదర్శనలో కార్మికుల పాల్గొనాలని సత్తిబాబు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు బొర్రా శ్రీనివాసరావు, కోటేశ్వరరావు, వరలక్ష్మి, ప్రసాదు, బాలరాజు పాల్గొన్నారు.










