Dec 15,2022 00:03

పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న సిఐటియు నాయకులు

ప్రజాశక్తి -పెదబయలు:పాడేరులో జరిగే సిఐటియు మహాసభలను విజయవంతం చేయాలని ఆ సంఘం నాయకులు బోండా సన్నినాబు కోరారు. ఈ మేరకు గోడ పత్రికలు ఆవిష్కరించిన ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండ గట్టేందుకు ఈ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కార్యదర్శి కె.సరబన్న, కమిటీ సభ్యులు సీహెచ్‌ రామారావు, తదితరులు పాల్గొన్నారు.