Dec 05,2022 23:58

పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న సిఐటియు నాయకులు

ప్రజాశక్తి-ఉక్కునగరం : ఈ నెల 9, 10 తేదీలలో నిర్వహించే స్టీల్‌ప్లాంట్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సిఐటియు) మహాసభలకు సంబంధించిన పోస్టర్‌ను ఎల్‌ఎంఎం పార్కులో యూనియన్‌ అధ్యక్షులు జె.అయోధ్యరామ్‌ సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విశాఖ ఉక్కు ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా పోరాడటంలో సిఐటియు ముందంజలో ఉందన్నారు. యూనియన్‌ ఏర్పడి 40 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఏర్పాటుచేసిన మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. కార్మికుల సంక్షేమం. పరిరక్షణ కోసం సిఐటియు అలుపెరుగని పోరాటం చేస్తుందన్నారు. సిఐటియుకు అండగా ఉన్న కార్మికులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. మహాసభలను విజయవంతం చేయాలని కార్మికులను కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు వైటి.దాస్‌, బి.మధు, బి.అప్పారావు, రామస్వామి, కె.సత్యనారాయణ, జి.గంగాధర్‌, నీలకంఠరావు, కెవి.సత్యనారాయణ, దేవుడునాయుడు, మొహిద్దిన్‌, దానయ్య తదితరులు పాల్గొన్నారు.