Dec 08,2022 23:56

పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న సిఐటియు నాయకులు

ప్రజాశక్తి-మునగపాక రూరల్‌
ఈ నెల 18, 19 తేదీల్లో పరవాడలో నిర్వహించే సిఐటియు జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా కోశాధికారి వీవీ శ్రీనివాసరావు, మండల సిఐటియు కార్యదర్శి ఎస్‌ బ్రహ్మాజీ పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయ ఆవరణలో మహాసభ గోడ పత్రికను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తూ, ప్రభుత్వ రంగాన్ని నాశనం చేస్తుందని విమర్శించారు. కార్మిక చట్టాలను సైతం మార్చివేసి దేశ సంపదను ఆదానీ అంబానీలకు కారు చౌకగా కట్టబెడుతుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగ, కార్మిక విధానాలకు వ్యతిరేకంగా భవిష్యత్తు పోరాటాల రూపకల్పన ఈ మహాసభలో జరుగుతాయని తెలిపారు. 18న పరవాడలో జరిగే భారీ కార్మిక ప్రదర్శన, బహిరంగ సభలలో కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఆళ్ల మహేశ్వర రావు, పెంటకోట సత్యనారాయణ, కాండ్రేగుల రాము, తదితరులు పాల్గొన్నారు.
కశింకోట : సిఐటియు జిల్లా మహాసభ పోస్టర్‌ను ఆ సంఘం నాయకులు గురువారం ఆవిష్కరించారు. ఈసందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు దాకారపు శ్రీనివాసరావు మాట్లాడుతూ కార్మిక చట్టాలు అమలు, ఉద్యోగ భద్రత ,కనీస వేతనాలు రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ తదితర హక్కుల కోసం ఉద్యోగ, కార్మిక, కర్షక , స్కీం వర్కర్లు, ప్రజలు తరఫున న్యాయం కోసం సిఐటియు రాజీలేని పోరాటాలు చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సాయిరాం, శ్రీదేవి, సూర్యలక్ష్మి, అమ్మాజీ, చుక్క ఎర్రయమ్మ, సన్యాసమ్మ, వి సత్యవతి, పార్వతి, నూకరత్నం, నాగమణి, ఈశ్వరమ్మ, మహాలక్ష్మి, భీమర శెట్టి అచ్చియమ్మ, తదితరులు పాల్గొన్నారు.