May 31,2023 23:31

సిఐటియు జండా ఆవిష్కరిస్తున్న రాజకుమార్‌

ప్రజాశక్తి- యు. కొత్తపల్లి
కొత్తపల్లి సిఐటియు సిఐటియు ప్రధాన కార్యదర్శి సిహెచ్‌ రాజకుమార్‌ కార్యాలయంలో బుధవారం సిఐటి జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులను చైతన్య పరిచి ప్రభుత్వం ద్వారా అందవలసిన కార్మిక చట్టాలను అమలు చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తోందని అన్నారు. కార్యక్రమంలో సిఐటియు మండల ప్రధాన కార్యదర్శి కె.వి.వి. సత్యనారాయణ, మండల అధ్యక్షులు కె.నాగేశ్వరావు, జిల్లా రైతు సంఘం కార్యదర్శి జి.అప్పారెడ్డి, అంగన్‌వాడీ జిల్లా అధ్య క్షులు డి.పద్మ, బిల్డింగ్‌ వర్కర్స్‌ మండల కార్యదర్శి సిహెచ్‌. సాంబశివ కుమార్‌, జి.శ్రీను, వి.గంగాధర్‌, సిహెచ్‌. చిన్ని, ఆశాజ్యోతి తది తరులు పాల్గొన్నారు