ప్రజాశక్తి-చీరాల: బాపట్ల జిల్లా సిఐటియు వర్క్ షాపును ఈ నెల 15,16 తేదీలలో చీరాల మండలం వాడ రేవులో నిర్వహిస్తున్నామని, ఈ వర్క్‌షాప్‌ను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ మజుందార్ అన్నారు. జిల్లా వర్క్ షాపు కరపత్రాన్ని ఆవిష్కరణ సందర్భంగా ఆయన మాట్లాడారు. కొత్తగా ఏర్పడిన బాపట్ల జిల్లాలో కార్మిక ఉద్యమాన్ని ప్రతి మండలంలో బలోపేతం చేయడానికి జిల్లా స్థాయి నాయకత్వానికి జులై 15,16 తేదీలలో చీరాల మండలం వాడరేవులో శిక్షణ ఇవ్వడానికి జిల్లా వర్క్ షాపు జరుపుతున్నట్లు తెలిపారు. ఈ వర్క్‌షాపునకు సిఐటియు రాష్ట్ర నాయకులు కె ఉమామహేశ్వరరావు, కె ధనలక్ష్మి, ముజుఫర్ అహ్మద్ హాజరవుతున్నారని తెలిపారు. కార్మిక ఉద్యమాన్ని బాపట్ల జిల్లాలో బలపరుచుకు నేందుకు ఈ వర్క్ షాప్ జరుగుతోందని, కావున ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ మజుందార్ చీరాల మండల కార్యదర్శి ఎం వసంతరావు, నాయకులు ఎం ప్రమీల, లక్ష్మి, సుజాత, చిట్టెమ్మ, మాధవి, సురేష్, ఝాన్సీ రాణి తదితరులు పాల్గొన్నారు.










