Sep 07,2023 21:48

సమావేశంలో పాల్గొన్న నాయకులు

ప్రజాశక్తి -పెనుకొండ : పెనుకొండ లో ఈ నెల9,10 తేదీలలో రెండు రోజులు పాటు జరిగే సిఐటియు జిల్లా వర్క్‌ షాపు జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి రమేష్‌ కోరారు. గురువారం పట్టణంలోని సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రమేష్‌ మాట్లాడుతూ సత్యసాయి జిల్లాలోనికార్మికుల ఎదుర్కొంటున్న సమస్యలపై నాయకత్వంతో భవిష్యత్‌ కార్యాచరణ గురించి చర్చించి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సత్య సాయి జిల్లాలో కార్మికలు సమస్యలపై ఆందోళనలు నిర్వహించడానికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై రెండు రోజులు పాటు నిర్వహిస్తున్న వర్క్‌ షాప్‌లో చర్చిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి సిఐటియు రాష్ట్ర, జిల్లా నాయకులు హాజరుకానున్నారని చెప్పారు. జిల్లా వర్క్‌ షాప్‌ ను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి బాబావలి, బావమ్మ, తిప్పన్న, మహబూబ్‌బాషా, రాజు, రావు, వజ్రం నాగప్ప తదితరులు పాల్గొన్నారు.