Nov 29,2022 23:51

పోస్టర్‌ ఆవిష్కరిస్తున్న సిఐటియు నేతలు

ప్రజాశక్తి-గొలుగొండ : డిసెంబర్‌ 18, 19 తేదీలలో పరవాడలో జరగనున్న సిఐటియు 12వ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి అడిగర్ల రాజు పిలుపునిచ్చారు. మంగళవారం మండలంలోని కేడిపేటలో సిఐటియు మండల కమిటీ అధ్వర్యంలో మహాసభల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ కార్మిక, ఉద్యోగుల సమస్యలపై నిరంతరం పోరాడుతున్న సిఐటియు జిల్లా మహాసభలకు జిల్లావ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొంటారని, 18న భారీ ర్యాలీ, బహిరంగ సభ ఉంటుందన్నారు. మహాసభలో ఇప్పటివరకు ఉద్యమ విజయాలను సమీక్షించడంతోపాటు భవిష్యత్‌ కార్యాచరణ రూపొందిస్తామన్నారు. కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి ఎం.మంగతాయారు, పంచాయతీ కార్మిక సంఘం నాయకులు ఎం.దేవత, పి.లోవరాజు పాల్గొన్నారు.