ప్రజాశక్తి- రాంబిల్లి
పరవాడలో ఈనెల 18, 19 తేదీల్లో జరగనున్న సిఐటియు జిల్లా మహాసభపై శుక్రవారం మండలంలోని వై లోవ, పెదకలువలపల్లి, వెల్చూరు, సంతపాలెం, లాలంకోడూరు, లోపాలం, వెంకయ్య పాలెం, రాంబిల్లి, కేజీ పాలెం తదితర గ్రామాల్లో సిఐటియు నాయకులు ప్రచారం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు జి.దేముడునాయుడు మాట్లాడుతూ మహాసభ సందర్భంగా ఈనెల 18న ఆదివారం 18న ఉదయం 10 గంటలకు పరవాడలో జరుగు భారీ ప్రదర్శన బహిరంగ సభలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్మికుల సమస్యలపై సిఐటియు రాజీలేని పోరాటం చేస్తుందన్నారు ఈ మహాసభల్లో కార్మిక సమస్యలపై చర్చించి రాబోయే కాలంలో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు.
చోడవరం : సీఐటీయూ జిల్లా మహాసభల్లో కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు జి.వరలక్ష్మి పిలుపునిచ్చారు. ఈ మహాసభలకు అంగన్వాడి, మధ్యాహ్న భోజన కార్మికులు, ఆశ, ఐకేపీ, ఆటో, ముఠా, బిల్డింగ్, గ్రామ పంచాయతీ, విఆర్‌ఓలు ఇతర రంగాల కార్మికులు పాల్గొంటారని తెలిపారు. స్టీల్ ప్లాంట్, ఎల్‌ఐసి, విద్యుత్, రైల్వే వంటి సంస్థలను ప్రైవేట్ పరం చేయకూడదని, బ్రాండెక్స్, ఎస్‌ఈజెడ్, ఫార్మా కంపెనీలలో పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు పెంచాలని, ప్రమాదాలు జరగకుండా భద్రతా ప్రమాణాలు పాటించాలని, స్కీమ్ వర్కర్లకు కనీస వేతనం అమలు చేయాలని,ఉద్యోగభద్రత కల్పించాలని వంటి సమస్యలపై మహాసభలో చర్చించనున్నట్లు తెలిపారు.










