Dec 09,2022 23:44

కార్మికులతో మాట్లాడుతున్న దేవుడునాయుడు

ప్రజాశక్తి - రాంబిల్లి
ఈ నెల 18, 19 తేదీల్లో పరవాడలో జరగనున్న సిఐటియు జిల్లా 12వ మహాసభను జయప్రదం చేయాలని ఆ సంఘం నాయకులు శుక్రవారం రాంబిల్లి మండలంలో ప్రచారం నిర్వహించారు. మండలంలోని పలు రంగాలకు కార్మికులను కలిశారు. ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి జి.దేవుడునాయుడు మాట్లాడుతూ ఈ మహాసభలో జిల్లాలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి, కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత కార్మికులకు రక్షణ కరువైందన్నారు. బడా పెట్టుబడిడారులకు రాయితీలు ఇస్తూ, కార్మికులపై భారాలు వేస్తున్నారని విమర్శించారు. ధరలు విపరీతంగా పెరిగినప్పటికీ, కార్మికులు జీతాలు పెంచడం లేదన్నారు. పంచాయితీ కార్మికులకు రెండు సంవత్సరాలుగా జీతాలు ఇవ్వలేదని, ఇలా అయితే వారు ఎలా బతుకుతారని ప్రశ్నించారు. మహాసభలు సందర్భంగా ఈనెల 18న జరిగే బహిరంగ సభలో సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్‌.నర్సింగరావు ముఖ్య అతిథిగా ప్రసంగిస్తారని, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.