సిఐటియు ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి ఎ. కమల
ప్రజాశక్తి-చందర్లపాడు
మండల కేంద్రమైన చందర్లపాడులో సిఐటియు కార్యాలయంలో ఆదివారం సిఐటియు చందర్లపాడు మండల అధ్యక్షులు ఎస్.కె మౌలాలి అధ్యక్షతన చందర్లపాడు సిఐటియు 5వ మహాసభ సమావేశం నిర్వహించారు..ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా సిఐటియు ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి ఏ కమల పాల్గొని మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక విధానాల ఫలితంగా దేశంలో, రాష్ట్రంలో, పారిశ్రామిక, వ్యవసాయ నిర్మాణ రంగాలు, చేతివత్తులు దెబ్బతిన్నాయన్నారు. ప్రజలు పెద్ద ఎత్తున ఉపాధి కోల్పోయారని అన్నారు. కరోనా కాలంలో ప్రధాని నరేంద్ర మోడీ ఆత్మ నిర్బర్ భారత్ నినాదం కార్పొరేట్లకే లాభాలు తెచ్చి పెడుతున్నాయి తప్ప దేశీయ పరిశ్రమలను ఆదుకోవ డానికి ఏమాత్రం తోడ్పడటం లేదన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ని ముక్కలుగా చేసి అమ్మాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని, విద్యుత్ రంగాన్ని ప్రైవేటు చేతుల్లో పెట్టి ప్రజలపై మరిన్ని బారాల మోపుతు న్నారన్నారు. ఎన్నడూ లేనివిధంగా నిరుద్యోగం 9 శాతంకి, విద్యుత్ ఛార్జీలు, నిత్యవసర సరుకులు ధరలు విపరీతంగా పెరిగా యన్నారు. పాలు, పెరుగు వంటి అన్ని వస్తువులపై, సేవలపై జిఎస్టి ద్వారా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు భారాలు మోపుతున్నాయని, సామాన్య ప్రజల కొనుగోలు శక్తి నానాటికి దిగజారి పోతుందన్నారు. ఉద్యోగ, కార్మికుల ఆర్థిక సమస్యలపై, హక్కులపై సిఐటియు నిరంతరం పోరాటాలు చేస్తుందన్నారు. .సిఐటియు ఎన్టీఆర్ జిల్లా 11వ మహాసభలు విజయ వాడలో నవంబర్ 19, 20 తేదీల్లో నిర్వహిస్తున్నారనీ, ఈ మహాసభకు ఆశ వర్కర్లు,మధ్యాహ్న భోజన కార్మికులు, బిల్డింగ్ కార్మికులు, గ్రీన్ అంబాసిడర్లు, ఆటో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్ర మంలో సిఐటియు జిల్లా నాయకులు ఎంఎన్ పాత్రులు పాల్గొన్నారు. అనంతరం 17 మందితో నూతన కమిటీని ఎన్ను కున్నారు. చందర్లపాడుసిఐటియు మండల కార్యదర్శిగా వేల్పుల ఏసోబు, అధ్యక్షులుగా వి కమల,ఉపాధ్యక్షులుగా టి.రామారావు, జాయింట్ సెక్రటరీగా వి స్వరూప, కోశాధికారిగా జె లక్ష్మయ్య లను ఎన్నుకున్నారు.12 మందిని కమిటీ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు, బిల్డింగ్ వర్కర్స్, గ్రీన్ అంబాసిడర్లు,ఆటో కార్మికులు పాల్గొన్నారు.










