Nov 27,2022 00:23

వాల్‌ పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న కోటేశ్వరరావు, రాము, కార్మికులు

ప్రజాశక్తి అచ్యుతాపురం
డిసెంబర్‌ 18, 19 తేదీల్లో పరవాడలో జరగనున్న సిఐటియు అనకాపల్లి జిల్లా 12వ మహాసభ పోస్టర్‌ను శనివారం సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి జి.కోటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి ఆర్‌.రాము, మండల కార్యదర్శి కె.సోమునాయుడు, కార్మికులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ మహాసభలో ఉద్యోగులు, కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులు, స్కీం వర్కర్ల సమస్యలపై చర్చించనున్నట్లు చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలపై భవిష్యత్‌ పోరాటాలకు కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తుందని, వారి సమస్యలను పరిష్కరించడం లేదని పేర్కొన్నారు. మరో వైపు కార్పొరేట్‌ కంపెనీలకు కార్మిక హక్కులను తాకట్టు, ప్రభుత్వ రంగ సంస్థలను ధారాదత్తం చేస్తుందని విమర్శించారు. రాష్ట్రంలో జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం కార్మిక పోరాటాలపై నిర్బంధాన్ని ప్రయోగిస్తుందన్నారు. వీటిపై ఈ మహాసభలో చర్చిస్తామన్నారు. డిసెంబర్‌ 18న బహిరంగ సభ నిర్వహిస్తున్నామని, ఇందులో సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్‌.నరసింగరావు, రాష్ట్ర కార్యదర్శి స్వరూపరాణి పాల్గొని ప్రసంగిస్తారని తెలిపారు. ఈ బహిరంగ సభకు జిల్లాలోని కార్మికులు, స్కీమ్‌వర్కర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.