Jan 10,2023 22:48

       వేలేరుపాడు : బెంగుళూరులో ఈనెల 18, 19, 20 తేదీల్లో జరగనున్న సిఐటియు అఖిలభారత మహాసభను విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి మడివి దుర్గారావు పిలుపునిచ్చారు. మండలంలోని ఫ్రెండ్స్‌ ఆటో యూనియన్‌ ఆవరణలో ఈ మహాసభను జయప్రదం చేయాలని కోరుతూ మంగళవారం సిఐటియు జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి మడివి దుర్గారావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ధర్ముల రమేష్‌, సిఐటియు మండల కార్యదర్శి బొగారి వెంకటేశ్వర్లు, ఫ్రెండ్స్‌ ఆటో యూనియన్‌ నాయకులు కురిమళ్ల శ్రీను, రమేష్‌, అఫ్రోజ్‌, గెడ్డం మల్లి, శ్రీను పాల్గొన్నారు.
నూజివీడు:బెంగుళూరులో జరిగే సిఐటియు ఆలిండియా మహాసభను జయప్రదం చేయాలని కోరుతూ సిఐటియు నూజివీడు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో చిన్న గాంధీ బొమ్మ సెంటర్లో యూనియన్‌ జెండాను పట్టణ అధ్యక్షులు ఎన్‌ఆర్‌.హనుమాన్‌ మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులంతా ఐక్యంగా ఉండాలన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్‌ కోడ్‌లను రద్దు చేసే వరకూ అనేక రూపాల్లో ఆందోళన చేయాలన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను కాపాడాలని, కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలన్నారు. సిఐటియు నాయకులు జి.రాజు, చంద్రశేఖర్‌, కమల, పద్మాంజలి, మరియదాస్‌ నాగమణి, కుమారి, దుర్గ, సంసోను పాల్గొన్నారు.