సిఐటియు అక్కయ్యపాలెంజోన్ నూతన కమిటీ సభ్యులు
ప్రజాశక్తి-విశాఖపట్నం : సిఐటియు అక్కయ్యపాలెం జోన్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. జోన్ నాలుగో మహాసభలు తాటిచెట్లపాలెం భవననిర్మాణ కార్మిక సంఘం కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ భవిష్యత్తులో ఉద్యమాలు తీవ్రతరం చేయాలని పిలుపునిచ్చారు. కార్మిక వర్గం నూతన సమాజాన్ని నిర్మిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మహాసభల రిపోర్టును ప్రకాష్‌రావు ప్రవేశపెట్టారు. నూతన అధ్యక్ష కార్యదర్శులుగా స్వతంత్రకుమార్, ప్రకాష్‌రావు, కమిటీ సభ్యులుగా 8మందిని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజు, ప్రభాకరరావు, శంకర్ పాల్గొన్నారు.










