Jul 04,2023 23:53

ప్రజాశక్తి - కాకినాడ
అల్లూరి జయంతి సందర్భంగా సిఐటియు ఆధ్వర్యంలో టీచర్స్‌ హోమ్‌లో మంగళవారం మెగా రక్తదాన శిబిరాన్ని రోటరీ క్లబ్‌ సహకారంతో నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లూరి చిత్రపటానికి సిఐటియు అఖిలభారత ఉపాధ్యక్షులు జి.బేబిరాణి, జిల్లా అధ్యక్షులు శేషబాబ్జి పూలమాల వేసి నివాళులర్పించారు. బేబిరాణి మాట్లాడుతూ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా అన్ని జిల్లాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. , ఇది ఒక అలవాటుగా కార్మికులు, యువత రక్తదానాన్ని ప్రోత్సహించాలన్నారు. అనంతరం శేషబాబ్జి మాట్లాడారు. సీతారామరాజు పోరాటానికి గుర్తుగా ఈ సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. సిఐటియు కార్మికుల సమస్యలపైనే కాకుండా, సామాజిక సమస్యలపై, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. గతంలో కోవిడ్‌ సమయంలో అందించిన సేవలను గుర్తు చేశారు. వివిధ రంగాలకు చెందిన 83 మంది రక్తదానం చేశారన్నారు. కార్మికుల కుటుంబ సభ్యులు సైతం రక్తదానం చేయడానికి ముందుకురావడం అభినందనీ యమన్నారు. ఈ శిబిరాన్ని సామాజిక ఉద్యమకారుడు అయితాబత్తుల రామేశ్వరరావు, రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్‌ నాయకులు కాశి బాలయ్య, జెవివి నాయకులు మేక సుబ్బారావు, ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్‌, ఐఎఫ్‌టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జే.వెంకటేశ్వరరావు, అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇ.చంద్రావతి, ఆశా వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నర్ల ఈశ్వరి, చంద్రమళ్ల పద్మ, యునైటెడ్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు రత్నరాజు, నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ యూనియన్‌ నాయకులు గెద్దాడ సత్యనారాయణ, నీరజ, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్‌ కుమార్‌, కోశాధికారి ఎం.రమణ, ఇరిగేషన్‌ నాయకులు జి.చెల్లారావు, సిఐటియు నాయకులు పలివెల వీరబాబు, మేడిశెట్టి వెంకటరమణ, షేక్‌ పద్మ, రాజేశ్వరి, లలిత, మేరీ సమాధానం, ధనలక్ష్మి తదితరులు సందర్శించి రక్తదానం చేసిన కార్యకర్తలను అభినందించారు.