సిఐటియు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
ప్రజాశక్తి - నంద్యాల
నంద్యాల పట్టణంలోని సిఐటియు జిల్లా కార్యాలయం నందు ఆదివారం సిఐటియు రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కామ్రేడ్. పర్శా. సత్యనారాయణ శతజయంతి ఉత్సవాల సందర్భంగా రక్తదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సిఐటియు పట్టణ అధ్యక్షుడు లక్ష్మణ్ అధ్యక్షత వహించారు. కార్యక్రమం లో జిల్లా ప్రధాన కార్యదర్శి అద్యక్షులు ఏ. నాగరాజు, వి. ఎసురత్నం, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు టి. రమేష్ కుమార్ , సిఐటియు జిల్లా నాయకులు తోటమద్దులు, కే మహమ్మద్ గౌస్, ఎల్లయ్య ,బాల వెంకట్, వెంకట లింగం, తిరుపతయ్య రామ్ నాయక్ శివరాం వైబి వెంకటేశ్వర్లు సిపిఎం పట్టణ కార్యదర్శి పుల్లా. నరసింహ,ప్రజాసంఘాల నాయకులు లక్ష్మణ్, నాగూర్ జైలాన్, వెంకట్రావు లతోపాటు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.అనంతరం రక్తదాన శిబిరంలో 40 మంది పాల్గొని రక్తం ఇవ్వడం జరిగింది. ఈ సందర్బంగా సిఐటియు జిల్లా అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శులు వి ఏసురత్నం, ఏ నాగరాజులు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు రమేష్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా సిఐటియు గత 6 సంవత్సరాలుగా రక్తదానం శిబిరాన్ని నిర్వహిస్తున్నదన్నారు. ప్రజల ఆస్తితో నిర్మించిన ప్రభుత్వ రంగ సంస్థల రక్షణకై పోరాడుతూనే ద్రోహం చేస్తున్న ప్రభుత్వాల దుర్మార్గ వైఖరిని నిరసిస్తూ అనేక పోరాటాలు నిర్వహించడంతోపాటు పేద ప్రజలకు గర్భిణీలకు తల సేమియా వ్యాధిగ్రస్తులకు రక్తదానం చేయడంలో సిఐటియు పాత్ర ప్రతి రోజు పోషిస్తూనే ఉందని అన్నారు. రక్తదానం ప్రజల ప్రాణాల రక్షణకే కాదు మన ఆరోగ్యానికి కూడా అవసరమని రక్త దానం చేయడం ద్వారా మనం కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు అని అన్నారు.రక్తదానం చేసే వారికి గుండెపోటు వచ్చే అవకాశం చాలా తక్కువని అనేక అధ్యయనాలు వెల్లడిస్తున్నాయని, అధిక ఐరన్ ను తగ్గించడంలోనూ, మానసిక ఒత్తిడిని ఎదుర్కొనడంలోనూ రక్త దానం ఎంతో ఉపయోగకరం అని అన్నారు. రాబోయే కాలంలో పోరాటాలలోకి కార్మికులు విస్తృతంగా రావాలని అదేవిధంగా ప్రజలను ఇతరత్రా అనారోగ్యాలతో అవసరమైనటువంటి వారందరికీ రక్తమందించడంలో కూడా ముందుకు రావాలని అన్నారు.










