Jul 15,2023 23:44

నినాదాలు చేస్తున్న నాయకులు, కార్యకర్తలు

ప్రజాశక్తి-ముంచంగిపుట్టు:గిరి పోషణ కార్యకర్తలకు 17 నెలల బకాయి జీతాలు చెల్లించాలని మండల కేంద్రంలో శనివారం సిఐటియు మండల కార్యదర్శి కొర్ర శంకర్రావు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ మండల అధ్యక్షుడు కొర్ర శంకర్రావు, మాట్లాడుతూ, అంగన్వాడి కేంద్రం లేని గ్రామాలకు 2018లో ''గిరి పోషణ కార్యకర్తలుగా నియమించారన్నారు. అప్పటి నుంచి గిరి పోషణ కార్యకర్తలు దగ్గర ఉన్న అంగన్వాడి కేంద్రం నుంచి పాలు, గుడ్డు, పప్పు, బియ్యం, తీసుకొని గ్రామంలో వంట చేసి పిల్లలకు పెట్టేవారన్నారు. ఆట, పాటలు కూడా నేర్పిస్తున్నారన్నారు. మీటింగ్‌కు, పిల్లలకు వంట చేయడానికి సొంత డబ్బులు వెచ్చి స్తున్నారన్నారు. ఇప్పటివరకు 17 నెలలు అవుతున్నా గౌరవ వేతనం చెల్లించలేదని తెలిపారు. కూరగాయలు, కర్రల బిల్లులు ఇవ్వలేదన్నారు. ఈనెల 21న జిల్లా కలెక్టరేట్‌ వద్ద జరిగే ధర్నాఉ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సన్యాసమ్మ, శ్రీదేవి, లలిత గిరి పోషణ కార్యకర్తలు పాల్గొన్నారు.