బాధ్యతలు స్వీకరిస్తున్న ఎస్‌కె.బాజీలాల్
ప్రజాశక్తి-రాజవొమ్మంగి
రాజవొమ్మంగి నూతన సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా ఎస్‌కె.బాజీలాల్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఇక్కడ పని చేసిన సిఐ రవికుమార్ కృష్ణా జిల్లాకు బదిలీ కాగా, అమలాపురం రూరల్ నుండి బదిలీపై బాజీలాల్ రాజవొమ్మంగి సిఐగా వచ్చారు. ఈ సందర్భంగా సిఐని రాజవొమ్మంగి, జడ్డంగి ఎస్సైలు టీజీ నరేంద్ర ప్రసాద్, షరీఫ్, పోలీస్ సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సిఐ బాజీలాల్ స్థానిక విలేకరులతో మాట్లాడుతూ సంక్రాంతి పండుగ నేపథ్యంలో మండలంలో ఎక్కడైనా కోడిపందాలు, గుండాట, పేకాట, చిత్తులాట వంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కోడిపందాలకు ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని స్పష్టం చేశారు.










