భవనాన్ని ప్రారంభిస్తున్న డిఎస్‌పి శ్రీనివాస్ రెడ్డి
సిఐ కార్యాలయం ప్రారంభం
ప్రజాశక్తి -ప్యాపిలి
ప్యాపిలి పట్టణంలో పోలీస్ స్టేషన్ మైదానంలో కొత్తగా నిర్మించిన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయంను డోన్ డిఎస్‌పి శ్రీనివాస రెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా డిఎస్పి మాట్లాడుతూ గతంలో పూర్తిగా పడిపోయి శిథిలావస్థలో ఉన్న కార్యాలయాన్ని సిఐ శ్రీరాములు ఆధ్వర్యంలో భవనాన్ని పున నిర్మాణం చేపట్టినందుకు ఆయనను అభినందించారు. విధులు నిర్వహిస్తూ ఇలాంటి మంచి పనులు చేయడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో బేతంచర్ల సిఐ ప్రియతమ్ రెడ్డి, ప్యాపిలి ఎస్‌ఐ రాకేష్, ఏఎస్‌ఐలు బ్రహ్మం, శ్రీనివాసులు, కానిస్టేబుళ్లు శ్రీనివాసులు, రామంజి శేఖర్, నాగరాజు, లక్ష్మీనారాయణ, హోంగార్డులు పాల్గొన్నారు.










