ఫొటో : సిఐ గిరిబాబుకు అభినందనలు తెలియజేస్తున్న ఎస్‌పి
సిఐ గిరిబాబుకు అభినందనలు
ప్రజాశక్తి-ఉదయగిరి : అక్రమార్కుల ఆట కట్టించినందుకు సిఐ గిరిబాబును జిల్లా ఎస్‌పి డాక్టర్ కె.తిరుమలేశ్వర రెడ్డి ప్రశంసా పత్రంతో అభినందించారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఉదయగిరి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వి.గిరిబాబు బాధ్యతలు చేపట్టిన నుండి తమ సర్కిల్ పరిధిలోని కేసులే కాకుండా జిల్లాలో జరుగుతున్న ప్రధానమైన నేరాల పరిష్కారంలో చురుకుగా పాల్గొన్నందుకు జిల్లా ఎస్‌పి ఆయన్ను ప్రశంసా పత్రంతో అభినందించారు. ఇటీవల ఆధార్ ఎనేబుల్ పేమెంట్ సర్వీస్ ఆన్‌లైన్ మోసాలు పాల్పడుతున్న పది మంది నిందితులను చాకచక్యంగా అరెస్ట్ చేసినందుకు సిఐను అభినందించి ప్రశంసా పత్రం అందజేశారు.










