Dec 23,2022 00:02

అవార్డు అందుకుంటున్న సిఐ

ప్రజాశక్తి-నర్సీపట్నం టౌన్‌:ప్రతిభ కనబ రిచిన పోలీసులకు పురష్కరాలు లభించాయి. అనకాపల్లిలో వార్షిక క్రైమ్‌ రివ్యూలో భాగంగా జిల్లా ఎస్పీ గౌతమిలి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఈ ఏడాది అత్యంత ప్రతిభ కనబర్చిన పోలీసులకు ప్రశంసాపత్రాలు, మెమోంటోలు అందజేశారు. దీనిలో భాగంగానే నర్సీపట్నం టౌన్‌ సిఐ నమ్మి గణేష్‌కు జిల్లాలో ఉత్తమ పోలీసు అధికారిగా అవార్డు దక్కింది. ఎస్సైలు జి.గోవిందరావు, జి.ధనుంజయనాయులకు అవార్డులు దక్కాయి. అక్టోబర్‌ 17న నర్సీపట్నం రామారావుపేటలోని దస్త్రాల రాఘవేంద్రరావు ఇంట్లో దొంగతనం కేసును 24 గంటల్లోపు చేధించడం, గంజాయి ముఠాలను పట్టుకోవడం తదితర వాటి నేపథ్యంలో ఎస్పీ షాలిని వీరిని అభినందించారు.
రోలుగుంట:రోలుగుంట ఎస్సై నాగకార్తీక్‌కు ఉత్తమ ఎస్సై అవార్డు దక్కింది. మండలంలోని 2022 ఏడాదిలో కేసుల పరిష్కారంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన నేపథ్యంలో ఈ అవార్డు దక్కింది. ఈ మేరకు బుధవారం వార్షిక క్రైమ్‌ రివ్యూ సమావేశంలో అనకాపల్లి జిల్లా ఎస్పీ ఎంఎస్‌.గౌతమిశాలి చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఎస్సైని సిబ్బంది, పలువురు నాయకులు ప్రత్యేకంగా అభినందించారు.