Mar 22,2023 00:27
సిఐకి నివాళి అర్పిస్తున్న ఎస్‌పి వకుల్‌ జిందాల్‌

ప్రజాశక్తి-చీరాల: పోలీస్‌ అధికారి అకాల మరణం కుటుంబానికి మరియు పోలీస్‌ విభాగానికి తీరని లోటని జిల్లా ఎస్‌పి వకుల్‌ జిందాల్‌ పేర్కొన్నారు. చీరాల రామనగర్‌కు చెందిన మల్లి నాగేశ్వర రావు(50) నెల్లూరు జిల్లా ఆత్మకూరు లో సిఐగా విధులు నిర్వహిస్తూ సోమవారం తీవ్ర గుండెపోటుతో మృతిచెందారు. దీంతో బంధువులు మృతదేహాన్ని సొంతూరైన చీరాల్లోని రామనగర్‌కు తరలించారు. ఈ క్రమంలో జిల్లా ఎస్పీ మంగళవారం మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మృతిపై ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని నింపారు. కుటుంబానికి డిపార్ట్మెంట్‌ అండగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో డిఎస్పీ శ్రీకాంత్‌, సిఐలు మల్లికార్జునరావు, సోమశేఖర్‌, రూరల్‌ సిఐ మల్లికార్జునరావు, ఎస్బీ సిఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐలు, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.