కడపప్రతినిధి : ప్రతిఒక్కరికీ సహకారాన్ని అందించడమే ధ్యేయం. ఇందు లోభాగంగానే జిల్లాలో గడపగడపకూ సహకార బ్యాంకు పేరిట అవేర్‌నెస్ కార్యక్రమం చేపట్టాం. దీంతో జిల్లా కో-ఆపరేటివ్ సహ కార బ్యాంకు లాభాల బాట పట్టడం ఖాయం. ఈఏడాది కనీసం రూ.9.73 కోట్ల లాభాన్ని ఆర్జించడమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకెళ్తున్నాం. ఇందులోభాగంగా 2023-24 సంవత్సరంలో రూ.29 19 కోట్ల రుణాలను అందింస్తాం. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో దీర్ఘ కాలిక, స్వల్పకాలిక రుణాల కింద రూ.534 కోట్ల మేర వ్యవసాయం సహా మిగిలిన రంగాలకు రుణాలను అందించే దిశగా ముందుకెళ్తు న్నామని పేర్కొంటున్న డిసిసిబి సిఇఓ రాజేందర్‌తో ప్రజాశక్తి ముఖా ముఖి...
సహకార విస్తరణ ప్రణాళికల్ని తెలపండి?
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సహకార రంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యం. ఇందులోభాగంగా గడపగడపకూ సహకార బ్యాంకు కళాజాతా పేరిట ప్రతిగడపా తొక్కాలని నిర్ణయి ంచుకున్నాం. దీంతో రుణ రికవరీ, డిపాజిట్లు శాతాన్ని పెంచుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. దీంతోపాటు కస్టమర్ హైరి ంగ్ సెంటర్స్, జగనన్న పాల వెల్లువ వంటి వినూత్న కార్యక్ర మాలతో ముందుకెళ్తున్నాం.
ప్రాథమిక సహకార సంఘాలు ఎన్ని?
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 72 ప్రాథమిక సహకార సంఘాలున్నాయి. కడప జిల్లాలో 47, అన్నమయ్య జిల్లాలో 25 సహకార సంఘాలున్నాయి. వీటి ద్వారా డిసిసిబి కార్యకలాపాలను విస్తృతీకరిస్తాం.
చురుకైన ప్రాథమిక సహకార సంఘాల గురించి తెలపండి?
డిసిసిబి ఆధ్వర్యంలోని 72 ప్యాక్స్‌లో 30 ప్రాథమిక సహకార సంఘాలు చురుకుగా ఉన్నాయి. సదరు 30 ప్రాథమిక సహకార సంఘాలు చురుకుగా పని చేస్తే ఆశించిన లక్ష్యాన్ని చేరుకునే అవకాశం ఉంది.
ఖరీఫ్ ప్రణాళిక లక్ష్యాల్ని వివరించండి?
ప్రస్తుత ఖరీఫ్‌లో రూ.500 కోట్ల రుణాల్ని అందించడమే ధ్యేయంగా ముం దుకెళ్తున్నాం. ఇందులో వ్యవసాయ రుణాలకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. గతేడాది రూ.400 కోట్ల మేర రుణాల్ని అంది ంచాం. ఈఏడాది డిసిసిబి నిర్దేశిత లక్ష్యాన్ని అది óగమించి తీరుతాం.
డిసిసిబి రుణ విబాగాలేమిటి?
జిల్లా కో-ఆపరేటివ్ బ్యాంకు రూ.500 కోట్ల నిర్దేశిత రుణాల్లో వ్యవసాయం, డ్వాక్రా, హౌసింగ్, రియల్‌ఎస్టేట్, బంగారు రుణాల కింద రుణాల్ని అందించాలనే ఆలోచనలు ఉన్నాయి. వ్యవసాయ రుణాలు మొదలుకుని మిగిలిన విభాగాల రుణాల్ని పకడ్బందీగా పరిశీలన చేసిన తర్వాత రుణదారులకు రుణాలు అందించడం జరుగుతుంది.
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వ్యవసాయ రుణ వివరాలు తెలపండి?
జిల్లా కో-ఆపరేటివ్ బ్యాంకు ఆధ్వర్యంలో 72 వేల మందికి వ్యవసాయ రుణాలు అందించనున్నాం. ఇందులో కడప జిల్లాలో 52,880 మంది, అన్నమయ్య జిల్లాలో 17,120 మంది రైతులకు రుణాలు అందించాలని నిర్ణయించాం.
డిసిసిబి లాభాల ఆర్జన లక్ష్యమెంత?
జిల్లా కో-ఆపరేటివ్ బ్యాంకు ద్వారా రూ.9.73 కోట్ల లాభాల్ని ఆర్జించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. కొంత మేరకు లాభాల దిశగా పురోగమిస్తున్నామని చెప్పకోవచ్చు. భవిష్య త్‌లో మరిన్ని లాభాలతో కూడిన మార్కెట్ వాటాలను విస్తరిస్తాం.










