మాట్లాడుతున్న మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
సహకార సంఘాల బలోపేతానికి కృషి
-వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి
ప్రజాశక్తి-నెల్లూరు:రైతుల విస్తత ప్రయోజనాలే లక్ష్యంగా రాష్ట్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల బలోపేతానికి కషి చేస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం సహకార శాఖ, జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ సహకారంతో టౌన్ హాల్ లో ఏర్పాటు చేసిన సహకార సంఘాలు - అవగాహనా సదస్సును మంత్రి జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో మందకొడిగా ఉన్న సహకార రంగాన్ని బలోపేతం చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి ఆలోచన చేస్తూ, అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అనుభవజ్ఞులైన, సమర్థవంతమైన వ్యక్తులను సంఘాలకు చైర్మన్లుగా, సభ్యులుగా నియమించామన్నారు. సహకార బ్యాంకులను పటిష్ట పరచడం, రైతులకు విస్తతంగా సేవలందించడం, సహకార రంగంపై అవగాహన కల్పించడమే ప్రధాన ఉద్దేశంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కీర్తిశేషులు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సహకార సంఘాల అభ్యున్నతికి ఎంతో కషి చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అనంతరం వచ్చిన పాలకుల నిర్ణయాలు వల్ల సహకార రంగం గాడి తప్పిందని, మళ్లీ ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహకార రంగం పూర్వ వైభవానికి చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఇందుకు అనుగుణంగా సహకార చట్టంలో అనేక మార్పులు తీసుకొచ్చామని డిసిసిబి, ఆప్కాబ్, పీఏసీఎస్ ల బలోపేతానికి బ్యాంకింగ్, ఆడిటింగ్ రంగంలో విశిష్ట సేవలను వ్యక్తులను జనరల్ బాడీ లో సభ్యులుగా నియమించామన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా సకాలంలో ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు అందజేస్తున్నామన్నారు. నెల్లూరు సెంట్రల్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఇప్పటికే 100 ఏటీఎం సెంటర్లను ప్రారంభించామన్నారు. అనంతరం మంత్రిని పలువురు ప్రముఖులు, రైతులు ఘనంగా సత్కరించారు. ఈ అవగాహన సదస్సులో ఎంఎల్‌సి పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, కోఆపరేటివ్ మేనేజ్మెంట్ డైరెక్టర్ గణేషన్, జాయింట్ రిజిస్ట్రార్ రాధిక మాధవి, జిల్లా సహకార శాఖ అధికారి సుధా భారతి, ప్రకాశం జిల్లా సహకార శాఖ అధికారి రాజశేఖర్, నాబార్డ్ డిడిఎం రవి సింగ్, ఎన్‌డిసిసి బ్యాంక్ సిఇఒ శంకర్ బాబు, సహకార సంఘాల చైర్మన్లు, సభ్యులు, రైతులు పాల్గొన్నారు.










