
ప్రజాశక్తి - పంగులూరు
వ్యవసాయ రంగ అభివృద్ధికి సహకార రంగం ఎంతో కృషి చేస్తుందని ఇంకొల్లు పిడిసిసి బ్యాంక్ మేనేజర్ ఎం చెన్నారెడ్డి అన్నారు. సహకార వారోత్సవాల సందర్భంగా జనకవరం పంగులూరు వ్యవసాయ సాహకార పరపతి సంఘం వద్ద సహకార సంఘ జెండాను పంగులూరు పిఎసిఎస్ అధ్యక్షులు రావూరి రంగారావు ఎగురవేశారు. ఈ సందర్భంగా చెన్నారెడ్డి మాట్లాడుతూ వారం రోజులపాటు సహకార వారోత్సవాలు జరుగుతాయని చెప్పారు. తమ బ్యాంకు ద్వారా ఈ సంవత్సరం రూ.150కోట్ల రుణాలు రైతులకు అందజేశామని అన్నారు. ఇందులో 98శాతం రికవరీ జరిగిందని తెలిపారు. గ్రామాల్లో వ్యవసాయ సహకార పరపతి సంఘాలు వ్యవసాయ అభివృద్ధికి, రైతుల సంక్షేమానికి ఎంతో కృషి చేస్తున్నాయని చెప్పారు. పంగులూరు సొసైటీలో రూ.15కోట్ల రుణాలు ఇచ్చామని అన్నారు. కర్షక మిత్ర, ప్రకాశం కామధేను, ఎల్టి, ఎస్ఏఓ వంటి రుణాలు మొత్తం కలిపి ఒక రైతుకు రూ.25లక్షల వరకు పిడిసిసి బ్యాంకు రుణాలు ఇస్తుందని చెప్పారు. బ్యాంకు స్థాయిలో ఎస్‌హెచ్‌సిఓ, బంగారు రుణాలు, జగనన్న తోడు స్పెషల్‌గా వచ్చిన భారతి డిపాజిట్ స్కీం కింద రైతులకు అత్యధిక వడ్డీ చెల్లిస్తున్నామని చెప్పారు. రైతులు సొసైటీలను ఉపయోగించుకొని వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకోవాలని, మంచి లాభాలను పొందాలని కోరారు. కార్యక్రమంలో సూపర్వైజర్లు సిహెచ్ వెంకటేశ్వర్లు, సుభాని, తిమ్మసముద్రం సొసైటీ సీఈఒ కె రామకృష్ణ, బూధవాడ సొసైటీ సీఈఓ వి అంజయ్య, పావులూరు సొసైటీ సీఈఒ బి రామారావు, కొనికి సీఈఒ ఎస్‌కె మస్తాన్‌వలి, దగ్గుబాడు సీఈఒ పి హనుమంతరావు, పంగులూరు సీఈఒ లక్ష్మీదేవి, మండల కో-ఆపరేటివ్ ఇన్చార్జి నాగేశ్వరరావు, రైతులు ఆర్‌వి సుబ్బారావు, చిలుకూరి వీరరాఘవయ్య, బాచన రామారావు, చిలుకూరు ఆంజనేయులు, బాచిన నాగార్జున, గుడి పూడిరామారావు, ఆర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.