ప్రజాశక్తి - గిద్దలూరురూరల్ : ముఖ్యమంత్రి జనగ్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలోని సహజ వనరులను దోచుకోవటమే పనిగా పెట్టుకున్నార టిడిపి, జనసేన గిద్దలూరు నియోజక వర్గ ఇన్‌ఛార్జులు ముత్తుముల అశోక్ రెడ్డి, బెల్లంకొండ సాయిబాబు తెలిపారు. గుంతల ఆంధ్రప్రదేశ్ కు దారేది కార్యక్రమంలో భాగంగా గిద్దలూరు నుంచి నరవ గ్రామానికి వెళ్లే ఆర్ అండ్ బి రోడ్డు, పాములపల్లె వెళ్లే రోడ్లలో ఉన్న గుంతల వద్ద ఆదివారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసిపి పాలనలో రహదారులపై ఉన్న గుంతల్లో తట్ట మట్టి కూడా పోసిన పాపాన పోలేదన్నారు. రాష్ట్రంలో సరైన రోడ్లు లేవన్నారు. రోడ్లన్నీ గుంతలు మయంగా మారడంలో రాకపోకలు సాగించేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా నిమ్మకు నీరేత్తినట్లుగా వ్యవహరిస్తుందన్నారు. ప్రజా సంక్షేమమే థ్యేయమని గద్దెనెక్కి మాట తప్పిన జగన్ రెడ్డికి రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదన్నారు. వైసిపి ప్రభుత్వానికి చరమగీతం పాడేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షుడు సయ్యద్ శానేశావలి, మండల అధ్యక్షుడు మార్తాల సుబ్బారెడ్డి, జడ్‌పిటిసి బుడతా మధుసూదన్ యాదవ్, కౌన్సిలర్లు పాలుగుళ్ళ చిన్న శ్రీనివాస రెడ్డి, బిల్లా రమేష్ యాదవ్, బూనబోయిన చంద్రశేఖర్ యాదవ్, టిడిపి కాపు నాయకులు దుత్తా బాలీశ్వరయ్య, ఉలాపు బాలచెన్నయ్య, మాజీ సర్పంచులు చెన్నబోయిన రామకష్ణ యాదవ్, కడియం శేషగిరి, బీసీ నాయకులు పందిళ్ళపల్లి శ్రీనివాసులు, వేములపాటి చంటి తదితరులు పాల్గొన్నారు