Sep 14,2023 00:31

ప్రజాశక్తి - వేటపాలెం
ఇండియన్ ఇనిస్టిటూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ (ఐఐఆర్ఎఫ్) 2023 ప్రకారం సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్‌ కాలేజీకి దేశంలోని మొదటి 100సంస్థలలో 93వ సంస్థగా నిలవడం తమ ఘనతను చాటిందని కళాశాల సెక్రటరి వనమా రామకృష్ణారావు, కరస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు తెలిపారు. నాణ్యత, పనితీరు, బోధన, పరిశోధన, ప్లేస్మెంట్, ఆదాయం, అనుభవం వంటి వివిధ అంశాలను పరిశీలించి ఐఐఆర్‌ఎఫ్‌ ర్యాకింగ్ నిర్ణయిస్తుందని తెలిపారు. 2023లో చేపట్టిన ర్యాకింగ్‌లో జాతీయ స్థాయిలో 93వ ర్యాంకు, రాష్ట్ర స్థాయిలో 4వ ర్యాంకును సాధించినట్లు ప్రిన్సిపాల్‌ డాక్టర్‌  ఎం వేణుగోపాలరావు తెలిపారు. గత సంవత్సరం తమ కళాశాల జాతీయ స్ధాయిలో 105వ ర్యాంకు, రాష్ట్ర స్థాయిలో 5ర్యాంకు ఉండగా ఈ ఏడాది అంతకన్నా మెరుగైన స్థానం సాధించినట్లు తెలిపారు. న్యూఢిల్లీలోని చాణక్యపురిలో ఈ ఏడాది అక్టోబర్ 18న జరగనున్న ప్రతిష్టాత్మకమైన ఐఐఆర్ఎఫ్‌ వేడుకలలో ఈ అవార్డును అందుకోనున్నట్లు తెలిపారు. అవార్డు ప్రధానోత్సవ సభకు ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఛైర్మన్ ప్రొఫెసర్ టిజి సీతారాం హాజరవుతారని తెలిపారు.