Sep 20,2023 23:31

ప్రజాశక్తి - వేటపాలెం
స్థాయిన సెయింట్ ఆన్స్ ఇంజినీరింగ్ కాలేజీ మొదటి సంవత్సరం బిటెక్ విద్యార్థులకు కెరియర్ డెవలవట్ పై అతిధి ఉపన్యాసం నిర్వహించినట్లు కళాశాల అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ ఆర్‌వి రమణమూర్తి తెలిపారు. 2001లో స్థాపించిన తమ కాలేజీ న్యూడిల్లీ ఎఐసిటిఇ గుర్తింపు, కాకినాడ జెఎన్‌టియు శాశ్వత గుర్తింపు పొందినట్లు తెలిపారు. మూడు సార్లు ఎన్‌బిఎ గుర్తింపు, రెండు సార్లు నాక్ 'ఎ' గ్రేడ్ గుర్తింపు కలిగి ఉన్నట్లు తెలిపారు. యుజిసిచే 2(ఎఫ్), 12(బి) ద్వారా గుర్తింపు ఉన్నట్లు తెలిపారు. అటానమస్ కళాశాలగా గుర్తింపు, ఎపి ప్రభుత్వం ద్వారా 'ఏ' గ్రేడ్, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ శాశ్వత గుర్తింపు, టైమ్స్ ఆఫ్ ఇండియా, సిఇజిఆర్ సంస్థల సర్వేద్వారా భారత దేశంలోని ప్రముఖ ఇంజినీరింగ్ కళాశాలలో ఒకటిగా గుర్తింపు పొందినట్లు తెలిపారు. క్రియేటింగ్ ఎ బెటర్ వెర్షన్ ఆఫ్ సెల్ఫ్ అనే అంశంపై గుంటూరు ఆర్‌విఆర్ అండ్ జెసి కళాశాల అధ్యాపకులు, మోటివేషనప్ స్పీకర్, లైఫ్ కోచ్ సుజాత మాట్లాడినట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ మొయిద వేణుగోపాలరావు తెలిపారు. కళాశాల విజన్, మిషన్ ను తెలిపారు. విద్యార్ధులు క్రమశిక్షణను పాటించాలని అన్నారు. మొదటి సంవత్సరం ఇన్చార్జి కె అమర్నాథ్ బాబు కో ఆర్డినేటర్ గా వ్యవహరించారు. ఈ సెమినార్‌లో ఆర్‌ఎస్‌డి ధనలక్ష్మి, సకీనా ఒఫిర్ పాల్గొన్నారు.