
ప్రజాశక్తి - వేటపాలెం
సెయింట్ ఆన్స్ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్ధులు క్రికెట్ జాతీయ స్థాయి పాటీలలో విన్నర్స్ గా నిలిచినట్లు కళాశాల సెక్రటరి వనమా రామకృష్ణారావు, కరస్పాండెంట్ ఎస్ లక్ష్మణరావు తెలిపారు. గుంటూరు కెహెచ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజి కాలేజీలో ఇటీవల జరిగిన సంకల్ప్ - 2323 సందర్భంగా జరిగిన జాతీయ స్థాయి గేమ్స్, స్పోర్ట్స్ పోటీలలో వాలీబాల్ పోటీలలో పాల్గొన్న 22జట్లుతో పోటీపడి సెయింట్ ఆన్స్ కాలేజ్ జట్టు ఎస్‌ఆర్‌కె ఇనిస్టిట్యూట్ జట్టుపై ఫైనల్స్ లో గెలిచి విన్నర్స్ నిలిచినట్లు ప్రిన్సిపాల్ ఎం వేణుగోపాలరావు తెలిపారు. వాలీబాల్ జట్టులో మల్లికార్జునరెడ్డి, శివారెడ్డి, తేజా, హరికృష్ణా, రెడ్డి, విష్ణు, ఆండ్రూస్, సాయి, రేవంత్, సాయికృష్ణ, శ్రీను జట్టు పోటీలలో పాల్గొన్నట్లు పిడి అన్నం శ్రీనివాసరావు తెలిపారు. క్రికెట్ పోటీలలో 20జట్లుతో పోటీపడి తమ విద్యార్ధులు గుంటూరు ఆర్‌విఆర్ అండ్ జేసి జట్టుపై ఫైనల్స్ లో విన్నర్స్ గా గెలుపొందారని తెలిపారు. క్రికెట్ జట్టులో వెంకటేష్, నవీన్, రేవంత్, అరుణ్, రోహన్, వసీం, లోకేష్, వినయ్, లక్ష్మణ్, విజయ్, సౌమిత్, రేవంత్, శివకిరణ్ జట్టు విజేతలుగా నిలిచారని తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన అభినందన సభలో కళాశాల అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ ఆర్‌వి రమణమూర్తి, వివిధ విభాగాల హెచ్‌ఒడిలు అభినందించారు.