Sep 01,2023 23:35

ప్రజాశక్తి - వేటపాలెం
స్థానిక సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్‌ కళాశాలలో శుక్రవారం రక్తదాన శిబిరం నిర్వహించినట్లు కళాశాల సెక్రెటరీ వనమా రామకృష్ణ తెలిపారు. ఈ రక్త దాన శిబిరాన్ని కళాశాల ప్రిన్సిపాల్ వేణుగోపాలరావు ప్రారంభించారు. రక్తదానం చేసిన వారు ప్రాణ దాతలతో సమానమని అన్నారు. 100మంది విద్యార్థులు స్వచ్ఛందంగా రక్తదానం చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో చీరాల ఏరియా వైద్యశాల బ్లడ్ బ్యాంక్ ఇన్చార్జి డాక్టర్ రాజాసెలవెన్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డి జ్యోతి స్వరూప్ పాల్గొన్నారు.